29 C
Amaravati
Wednesday, January 29, 2020
Home బ్లాగ్

జామ ఆకు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

రుచిగా ఉండే జామపండ్లు తింటాం. కానీ జామ ఆకు గురించి ఎప్పుడయినా ఆలోచించారా? వాటిల్లో ఉండే పోషకాల గురించి విన్నారా? ఈ ఆకుల్లో పలు ఆరోగ్య సమస్యలు రాకుండా చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. నొప్పులూ, వాపులను నివారించే గుణాలూ అధికమే! నీటిని మరిగించి, శుభ్రంగా కడిగిన జామ ఆకులను అందులో వేసి చల్లారిస్తే, జామాకుల టీ తయారవుతుంది.

దీంతో ఎన్నో రకాల ఫలితాలను పొందొచ్చు. ఈ టీ తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులు అదుపులో ఉంటాయి. దీన్లోని పోషకాలకు బరువు తగ్గించే గుణం కూడా ఉంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరిగి బాధపడే వారు ఈ టీని నెలకోసారి తాగినా ఫలితం కనిపిస్తుంది. అజీర్ణ సమస్యలూ తగ్గుతాయి.

జామాకు టీని తాగితే శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. జలుబూ, దగ్గూ నెమ్మదిస్తాయి. శుభ్రంగా కడిగిన జామాకులను నమలడం వల్ల పంటి నొప్పులు దూరమవుతాయి. చిగుళ్ల నొప్పీ, నోటిపూతా తగ్గుతాయి.

చక్కెర(తీపి) కి ప్రత్యామ్నాయ పదార్ధాలు

తియతియ్యని వంటకాల్ని చూడగానే ఎవరికైనా నాలుక జివ్వున లాగేస్తుంది. ఒక ముక్కయినా నోట్లో పెట్టుకోకపోతే మనసు వూరుకోదు. అదేపనిగా అటువైపే లాగేస్తుంది. తీపి తహతహ తీవ్రతే అలాంటిది. మరోవైపు తీపి పదార్థాల్లో ఉండే చక్కెర మనల్ని భయపెడుతూ వెనక్కి నెడుతుంటుంది. మరిలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గమే లేదా? ఇలాంటప్పుడు చక్కెరకు బదులుగా ఇతర పదార్థాల్ని వెదుక్కోవటమే మేలు. చక్కెరకు తేనె, పండ్లు మంచి ప్రత్యామ్నాయాలు. వీటినీ పరిమిత మోతాదుల్లో తీసుకోవటమే మంచిదని హెచ్చరిస్తున్నారు. తీపి విషయంలో నిత్యం మనల్ని వేధించే కొన్ని సందేహాల్ని తీర్చుకుందామిలా.

తేనెతో ఆరోగ్య ప్రయోజనాలేమిటి?
తేనెలో గ్లూకోజ్‌, ఫ్రక్టోజ్‌, మెగ్నీషియం, ఇనుము, క్యాల్షియం వంటి ఖనిజాలు, బి-కాంప్లెక్స్‌ వంటి విటమిన్లు ఉంటాయి. తేనెలో సమృద్ధిగా ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఇది సూక్ష్మక్రిమినాశినిగా, యాంటీఇన్‌ఫ్లమేటరీగానూ పనిచేస్తుంది. అంతేకాదు, ఇందులో కొవ్వు ఉండదు. కాకపోతే.. క్యాలరీలు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఆ విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం.

అల్పాహారానికి పండ్లు ప్రత్యామ్నాయమా?
అల్పాహారానికి పండ్లు చక్కని ప్రత్యామ్నాయం. అవి పీచు, ఫ్రక్టోజ్‌, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. ఎక్కువెక్కువ క్యాలరీలు లేకుండానే వీటన్నింటినీ పొందవచ్చు. పండ్లను చిరుతిండ్లలా కూడా తినొచ్చు.

తీపిని పూర్తిగా పక్కన పెట్టాలా?
చక్కెరను ఎక్కువెక్కువగా తీసుకోవటం వల్ల రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. దీనివల్ల పలురకాల వ్యాధుల బారిన పడే అవకాశాలు పెరుగుతాయి. చక్కెరను రోజుకు రెండు చెంచాలకు మించి తీసుకోవద్దు. పూర్తిగా మానేసినా మంచిదే. ఎండుద్రాక్ష, ఖర్జూరాలు, బెల్లం, తేనె వంటివి తీసుకోవచ్చు.

తీపి తహతహను ఎలా అణచుకునేది?
తీపి తహతహను నియంత్రించుకునేందుకు ఇతరత్రా ఆహార పదార్థాల్ని తీసుకోవాలి. బాగా శుద్ధి చేసిన ఆహార పదార్థాల్ని, ఐస్‌క్రీముల వంటి వాటిని మానెయ్యాలి. నీటిని ఎక్కువగా తాగాలి. పీచు సమృద్ధిగా ఉండే పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు తినాలి. మాంసకృత్తులు అధికంగా ఉండే ఆహారం వల్ల రక్తంలో చక్కెర అదుపులో ఉంటుంది. తీపిపై తహతహ తగ్గుతుంది.

మళ్లీ మళ్లీ వేడిచేయడం వల్ల ఆహారానికి జరిగే నష్టము

మారుతున్న జీవనశైలి కారణంగా చాలామందికి ఎప్పటిక ప్పుడు తాజాగా వండుకొని తినే సమయం చిక్కడం లేదు. వండిన వాటినే రెండోసారి వేడి చేయడం చాలా ఇళ్లల్లో తప్పనిసరవుతోంది. వేపుళ్లకి వాడగా మిగిలిన నూనెను ఇతర పదార్థాల తయారీలో ఉపయోగించడం, కూరలని, మాంసాహారాన్ని మళ్లీమళ్లీ వేడి చేయడం, వంటివన్నీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని గుర్తించాలి.

మళ్లీ మళ్లీ వేడి.. గుండెకు చేటు

పండుగలప్పుడు, ఇంట్లో కార్యక్రమాలున్నప్పుడు పిండి వంటలు తప్పనిసరి. ఇందుకోసం పెద్ద కడాయి నిండా నూనె వేసి రకరకాల పదార్థాల్ని వేయిస్తాం. మిగిలిన నూనెను మళ్లీ వాడుతుంటాం. ఒకసారి నూనెని స్మోక్‌ పాయింట్‌ వరకు వేడిచేస్తే దానిలో రసాయన చర్య జరిగి స్వభావం మారుతుంది. మళ్లీ దానినే వేడిచేస్తే అందులో విషపదార్థాలు తయారవుతాయి. ఆ నూనెతో చేసిన పదార్థాల్ని తినడం వల్ల గుండెజబ్బులు, నరాల సంబంధ వ్యాధులు దాడిచేస్తాయి. ముఖ్యంగా రోడ్డువారన అమ్మే పదార్థాలు, రెస్టారంట్‌ ఆహారం పట్ల జాగ్రత్త అవసరం. స్వీట్లు, బజ్జీల వంటివి తినేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇంట్లో వాడే సోయా, వెజిటబుల్‌ నూనెల్ని మళ్లీమళ్లీ వేడి చేయకూడదు. నెయ్యి, డాల్డా, కొబ్బరినూనె, వేరుసెనగనూనె వంటివి (కొంతవరకు) వేడిచేసినా వాటి స్వభావం పెద్దగా మారదు. కానీ అవీ హానికరమే! అందుకని కావాల్సినంతే వాడాలి. చిన్న కడాయిలో వంటకాలు చేస్తే నూనె తక్కువ పడుతుంది.

అన్నాన్ని వేడి చేస్తున్నారా?

వండిన అన్నం వండినట్టే ఉంది. పారేయలేం. పైగా బియ్యం బోలెడు ఖరీదంటూ తిరిగి అన్నాన్ని వేడిచేసే వారిని చూస్తుంటాం. అది తప్పేం కాకపోయినా, అన్నాన్ని సరిగ్గా భద్రపరచకున్నా, ఆ తరవాత సక్రమంగా వేడిచేయకపోయినా ఆరోగ్యానికి ప్రమాదమే. అన్నాన్ని కొన్ని గంటల పాటు బయటే ఉంచి, ఆ తరవాత ఫ్రిజ్‌లో పెట్టి తినాలనుకున్నప్పుడు అరకొరగా వేడిచేయడం సరికాదు. బియ్యంలో కొన్నిసార్లు బ్యాక్టీరియా ఆవాసం ఉంటాయి. దాంతో అన్నాన్ని సరిగా వేడిచేయనప్పుడు వృద్ధిచెందుతాయి. అందుకే పూర్తిగా వేడిచేయాలి. అన్నంపై కాసిని నీళ్లు చల్లి కుక్కర్‌లో ఉంచి ఒక కూత రాగానే దించేయాలి. దాంతో బ్యాక్టీరియా వృద్ధి చెందదు.

పోషకాలు అధికంగా ఉండే ఏ పదార్థాలయినా త్వరగా పాడవుతాయి. ముఖ్యంగా మాంసకృత్తులు అధికంగా ఉండే చికెన్‌, చేప, పాలు, పాల ఉత్పత్తులు, పచ్చి బఠాణీ, గుడ్డు, వంటివాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చికెన్‌లో సాల్మొనెల్లా బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందుతుంది. వండిన తర్వాత రెండు గంటలకన్నా ఎక్కువ సేపు ఆ కూరను బయట ఉంచకూడదు. త్వరగా చల్లార్చి ఫ్రిజ్‌లో పెట్టేయాలి. పాలు, పాల ఉత్పత్తులనూ చల్లార్చాకే ఫ్రిజ్‌లో ఉంచాలి. మాంసాన్ని తిరిగి వేడిచేసి తినాలనుకుంటే, హడావుడిగా కాకుండా బాయిలింగ్‌ పాయింట్‌ కంటే ఎక్కువగా వేడి చెయ్యాలి. ముఖ్యంగా చికెన్‌ ముక్కలు మధ్యభాగంలోనూ వేడెక్కాలి. అయినా పదేపదే వేడి చేసి తినడం ఆరోగ్యానికి మేలు చేయదు. చిన్న రెస్టారంట్లలో చికెన్‌ను మళ్లీ మళ్లీ వేడిచేస్తారు. ఫలితంగా పోషకాలు అందవు సరికదా త్వరగా జీర్ణం కాదు.

వేపుళ్లలో నూనె కూడా ఎక్కువే కాబట్టి ఆరోగ్యపరంగా చేటు. ఒకసారి వండిన గుడ్డు రబ్బరులా సాగుతుంటే రెండోసారి వేడిచేయకూడదు. అలాగే పదార్థాలని వేడిచేసేటప్పుడు పరిశుభ్రత తప్పనిసరి. అంటే అప్పుడే పచ్చిమాంసాన్ని పట్టుకొని వెంటనే మరో కూర వండుతుంటే బ్యాక్టీరియా దానికి వ్యాపిస్తుంది. కాబట్టి చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. బఠాణీలు వండుతున్నప్పుడు ఎండువి ఎంచుకుంటే తిరిగి వేడిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పచ్చివయితే త్వరగా పాడవుతాయి.

వేడితో కరిగే పోషకాలు

పాలను వేడిచేస్తేనే వాటి నాణ్యత తెలుస్తుంది. పాలల్లో సమస్య ఉంటే వేడిచేసినప్పుడు విరిగిపోతాయి. అందుకే ప్రతిసారీ వేడి చేసుకొని తాగాలి. కాకపోతే వేడి చేసినప్పుడల్లా పాలల్లోని వాటర్‌ సాల్యుబుల్‌ విటమిన్లతో పాటు కొన్ని పోషకాలు తగ్గుతూ ఉంటాయి. అవసరానికి తగినంతయితే.. మేలు తాజా కాయగూరలని వండినప్పుడు సహజంగానే కొన్ని పోషకాలు తగ్గుతాయి. ఇక, రెండోసారి వేడిచేస్తే మరికొంత నష్టం. అందుకే అవసరం మేరకే వండుకోవడం మేలు.

పర్చూరు ఎమ్మెల్యే ఏలూరికి దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు

దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ ఆదర్శ యువ ఎమ్మెల్యే అవార్డుకు ప్రకాశం జిల్లా, పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు ఎంపికయ్యారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించే అవార్డుకు దక్షిణ భారతదేశం నుంచి పర్చూరు శాసనసభ్యులు ఎంపిక చేయడం దేశం మొత్తం ప్రాధాన్యత సంతరించుకుంది. ఫిబ్రవరి 23న ఢిల్లీలో అతిరథ మహారథుల చేతుల మీదుగా అవార్డు ప్రదానోత్సవం నిర్వహించనున్నారు. మీట్ వరల్డ్ పీస్ యూనివర్సిటీ, భారత స్టూడెంట్ పార్లమెంట్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టాత్మక పురస్కార ప్రధానోత్సవం జరగనుంది. ఢిల్లీ లోని రాజపథ్ మౌలానా ఆజాద్ రోడ్డులోని విజ్ఞాన్ భవన్ లో ఫిబ్రవరి 23న పురస్కారాన్ని ఎమ్మెల్యే ఏలూరి అందుకోనున్నారు.

ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో

ఏలూరి సాంబశివరావు నిర్వహించిన అన్ని రకాల ప్రజారంజక పాలన, సంక్షేమ పథకాలు ,నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం, ఇందుకోసం తన కార్యాలయంలో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయడం, టీం లీడర్ షిప్, ప్రజాస్వామ్య విలువలను కాపాడటం, గతంలో ఈ ప్రాంతంలో ఎవరు చేయలేని అనేక అభివృద్ధి పనులను పూర్తి చేయడం, ఎమ్మెల్యే ఏలూరి ఘనత. దీనితో పాటు పర్చూరు నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ అయిన ఎన్టీఆర్ వారధి నిర్మాణంతో పాటు గతంలో ఎవరూ సాహసించని అనేక జలవనరుల ప్రాజెక్టులను నిర్మించడం నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు కృషి చేయడం, ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండడం, ప్రతి సమస్య పరిష్కారానికి నేనున్నానంటూ ప్రజలకు నిత్యం భరోసా కల్పించడం తదితర అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ఏలూరి సాంబశివరావును ప్రతిష్ఠాత్మక ఈ జాతీయ పురస్కారాన్ని ఎంపిక చేశారు.

అరుదైన పురస్కారానికి ఇద్దరు ఎమ్మెల్యేలు

భారతదేశంలోనే అరుదైన పురస్కారానికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఎంపికయారు. దక్షిణ భారతదేశం నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఉత్తర భారత దేశం నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన లంచ్ బాలాఘాట్ ఎమ్మెల్యే(ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) డిప్యూటి స్పీకర్ డాక్టర్ హినా కవ్రే లను ఈ అవార్డు వరించింది.

అధినేత అభినందనలు

దేశంలోని ఉత్తమ పురస్కారానికి తమ పార్టీ ఎమ్మెల్యే ఏలూరి ఎంపిక కావడం పట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పలువురు రాజకీయ ప్రముఖులు, ఎమ్మెల్యే లు ఏలూరిని అభినందించారు.

పండుగ వాతావరణం

అలాగే తమ ఎమ్మెల్యే కి పుట్టినరోజు నాడే అరుదైన గౌరవం దక్కడంతో ప్రజలు, అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. దీంతో పర్చూరు నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది.

రోగనిరోధక శక్తి పెరగాలంటే తీసుకోవాల్సిన ఆహార పదార్ధాలు

శరీరంలో రోగ నిరోధక శక్తి ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. మనకి తరచుగా జలుబు, జ్వరం, అలసట, ఎలర్జీల బారిన పడుతూ ఉంటాం. వీటన్నింటి నుండి తప్పించు కోవాలంటే రోజూ తినే ఆహార పదార్థాల ద్వారానే రోగనిరోధక శక్తిని పెంచు కోవాలి.

సరైన ఆహాహాన్ని తీసుకుంటే ఈ సమస్యను తేలికగా అధిగమించ వచ్చంటున్నారు పోషకాహార నిపుణులు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా సరైన పోషకాహారాన్ని తీసుకోవాలి. విటమిన్లు, మినరల్‌‌స, పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

విటమిన్లు: విటమిన్‌ సి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల వైరస్‌పై పోరాడి ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. టమాట, బంగాళదుంప వంటి కూరగాయల్లో, నారింజ, నిమ్మ, కమలా, కివి పండ్లలో విటమిన్‌ సి ఉంటుంది.

జింక్‌: శరీరం కోల్పోయిన యాంటీ బాడీ కణాలు తిరిగి పున…ఃనిర్మితం కావడంలో తోడ్పడుతుంది. గుడ్లు, మాసం, పెరుగు, పాలు, బీన్‌‌స, సీఫుడ్‌లలో జింక్‌ లభిస్తుంది.

పెరుగు: ప్రతిరోజూ ఒక కప్పు తాజా పెరుగును తీసుకోవాలి. ఇది జీర్ణాశయంలో ఉండే బాక్టీరియాను నిర్మూలిస్తుంది.

కెరోటిన్‌‌‌: ప్రతిరోజు అరకప్పు తాజా క్యారెట్‌ను తినాలి. దీనిలో ఉండే బీటా కెరోటిన్‌, విటమిన్‌ బి6లు యాంటీ బాడీ కణాలు ఉత్పత్తిని ఉత్తేజపరుస్తాయి.

వెల్లుల్లి: దీనిలో ఉండే మినరల్‌‌స బాక్టీరియా, ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌లపై పోరాడేలా చేస్తాయి. ప్రతిరోజూ ఆహారంలో ఒక స్పూన్‌ వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.

ఐరన్‌: రోజూ నాలుగు లేదా ఐదు ఖర్జూరాలను తీసుకోవడం వల్ల శరీరంలో సరిపడా ఐరన్‌ పెరుగుతుంది.

పొటాషియం: దీనిలో విటమిన్‌ సి, పొటాషియం అధిక మోతాదులో ఉంటాయి. దీని వల్ల అధిక రక్తపోటుని తగ్గించి శక్తిని పెంచుతుంది.

మన శరీరంలో చెడు కొవ్వును తగ్గించేవి

మన జీవన విధానంలో మార్పులు చేసుకోవడం ద్వారా బ్లడ్ కొలెస్ట్రాల్ లో చెడ్డ కొవ్వును అదుపు చెయ్యవచ్చు. ప్రతిరోజూ సైక్లింగ్, నడక, ఈత వంటి తెలికపాటి వ్యాయామాలు చెయ్యాలి. దీనివలన గుండె పటిష్టపడుతుంది. చెడ్డ కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుతుంది. అధిక బరువు మాయమవుతుంది. రక్త నాళాలలో వాపు, క్లాగింగ్ తగ్గి, రక్తనాళాల గోడలు దలసరికాకుండా వుంటాయి.

ఏ ఏ పదార్థాలు తినడం మంచిదో? వాటిలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు ఏమిటో? అవి తినడం వల్ల మన శరీరంలోని కొవ్వు పై ఏ విధంగా పనిచేస్తాయో తెలుసుకుందాం.

ఆపిల్ : రక్తంలోని కొలెస్ట్రాల్ నిల్వల్ని తగ్గించడంలో ఆపిల్ పండు ఉపయోగపడుతుంది. లివర్ తయారు చేసే చెడ్డ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. ఈ పండులో మాలిక్ ఆమ్లం, శరీరంలోని కొవ్వులను జీర్ణం చేస్తుంది.

బీన్స్ : బీన్స్ లో ఉండే కరిగే పీచు చెడ్డ కొలెస్ట్రాల్ తయారీని నిలుపుదల చేస్తుంది. బీన్స్ లోని లేసిథిన్ కొలెస్ట్రాల్ కరిగిపోయేలా చేస్తుంది. పొటాషియం, రాగి, భాస్వరం, మాంగనీసు ఫోలిక్ ఆమ్లాలు కూడా దీనిలో ఉన్నాయి.

బెర్రీస్ : బ్లాక్ బెర్రీ లోని విటమిన్స్ గుండెకు, ప్రసరణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి. దీనిలోని కరిగే పీచు పెక్టిన్ కొలెస్ట్రాల్ ను శరీరం నుంచి బయటికి పంపుతుంది.

వంకాయ : అనేక రకాల విటమిన్లు, మినరల్స్ కలిగిన వంగ అనేక ఫైటో న్యూట్రియంట్లు కలిగి ఉంటుంది. ఆక్సీకరణ ప్రక్రియలో తోడ్పడతాయి.

ద్రాక్ష : ఆంతో సైనిన్స్, టానిన్స్ వంటివి కొలెస్ట్రాల్ నిల్వల్ని బాగా తగ్గిస్తాయి. ద్రాక్ష లోని పొటాషియం, శరీరంలోని విష పదార్థాలను నిర్విర్యం చేస్తుంది. మధుమేహగ్రస్తులకు ద్రాక్ష నిషిద్ధం.

జామపండు : తాజా జమపండ్లు శరీరానికేంతో మేలు చేస్తాయి. జమలోని విటమిన్ సి భాస్వరం, నికోటిన్ ఆమ్లం, కరిగేపీచు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను పటిష్ట పరిచి, కొలెస్ట్రాల్ తగ్గించి, గుండెను సంరక్షిస్తాయి.

పుట్టగొడుగులు : కొలెస్ట్రాల్ నిల్వలు తగ్గించంలో మాష్ రూమ్స్ లోని విటమిన్స్ బి, సి కాల్షియం, మినరల్స్ బాగా ఉపయోగాపడతాయి.

బాదం పప్పు : బాదం పప్పు తినడం వల్ల చెడ్డ కొలెస్ట్రల్ ను తగ్గిస్తుంది. దీనిలోని ఒలియిక్ ఆమ్లం, గుండెను వ్యాధుల బారినపడకుండా రక్షిస్తుంది. జీడిపప్పులోని మోనో అన్ సచురేటేడ్ కొవ్వును తగ్గించి గుండెను పదిలంగా ఉంచుతాయి.

వాల్ నట్స్ : వాల్ నట్స్ లోని ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చెడ్డ కొలెస్ట్రాల్ ను గణనీయంగా తగ్గిస్తాయి. తినడం వల్ల చెడ్డ కొలెస్ట్రల్ ను తగ్గిస్తుంది. దీనిలోని ఒలియిక్ ఆమ్లం, గుండెను వ్యాధుల బారినపడకుండా రక్షిస్తుంది.

జీడిపప్పు : జీడిపప్పులోని మోనో అన్ సచురేటేడ్ కొవ్వును తగ్గించి గుండెను పదిలంగా ఉంచుతాయి. వాల్ నట్స్ లోని ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చెడ్డ కొలెస్ట్రాల్ ను గణనీయంగా తగ్గిస్తాయి.

వెల్లుల్లి : రక్తపోటును, ఎక్కువగా వున్న చెడ్డ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.

సొయా : ఎనిమిది రకాల ఆవశ్యక మూలకాలు గల ఒకే ఒక శాకాహార మాంసకృత్తులు సోయాలో వున్నాయి. సోయా మాంసకృత్తులు రోజూ తీసుకుంటే కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. రక్తం నుండీ కొలెస్ట్రాలును విసర్జించే లివర్ శక్తిని పెంచుతుంది. సోయా చిక్కుళ్ళలో విటమిన్ b3, b6, E ఉన్నాయి.

ఓట్స్ : దీనిలోని బీటా గ్లూకస్ అనే ప్రత్యేక కరిగే పీచుపదార్థం స్పంజివలె పనిచేసి కొలెస్ట్రాల్ ను గ్రహిస్తుంది.

సబ్జా గింజలు : దీని పొట్టు పెగులలోనికి కొలెస్ట్రాల్ ప్రవేశించనీయదు. చెడ్డ కొలెస్ట్రాల్ ను తగ్గించే అత్యంత శక్తి వంతమైన పదార్థంగా ప్రసిద్దికెక్కింది.

పొట్టు తీయని గింజెలు : గోధుమ, మొక్కజోన్న ఓటు ధ్యాన్యం, బార్లీ వీటిలోని 3 పొరలను కలిపి ఏక మొత్తంగా తింటే కొలెస్ట్రాల్ పరిమాణం రక్తపోటు, రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తుంది.

షుగర్‌ ఉన్నవారు తినగలిగే పండ్లు

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసు. అన్నంతో కూడా ప్రకృతి సిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి.

కొన్ని రకాల పండ్లను తరచూ తీసుకోవడం వల్ల అవి మధుమేహగ్రస్తుల్లో చక్కెర స్థాయి నియంత్రలో ఉంటుంది. అయితే ఈ పండ్లును వారు పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. అయితే మధుమేహ గ్రస్తులు తీసుకొనే పండ్లు రోజు ఆధారంగా అంటే మెదటి రోజుకి, రెండవ రోజుకి సమానంగా ఉండేలా సరిచూసుకోవాలి.

కివి పండు : కొన్ని పరోశోధనల ప్రకారం కివి పండ్లు తినడం వల్ల శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయి తక్కువ అవుతుందని దృఢపరిచారు.

నేరేడు : మధుమేహగ్రస్తులు షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్లో ఉంచడానికి ప్రతి రోజూ నల్లటి నేరేడు పండ్లను తీసుకోవచ్చు. తెల్లని నేరేడు పండ్లలో కూడ ఫైబర్‌ అధికంగా ఉంటుంది కాబట్టి వీటిని కూడా తీసుకోవచ్చు.

తెల్ల నేరేడు : ఇవికూడా నేరేడు పండ్ల జాతివే. తెల్లనేరేడు పండ్లలో కూడా ఫైబర్‌ ఎక్కువగా ఉండటం వల్ల బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ ను కంట్రోల్‌ చేసే శక్తి అందిస్తుంది. కాబట్టి వీటిని కూడా రోజూ తినవచ్చు.

స్టార్ ఫ్రూట్ : నేరేడు పండ్లులాగే ఉండే ఈ స్టార్‌ ఫ్రూట్‌ మధుమేహ గ్రస్తులకు చాలా మంచిది బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ ను కంట్రోల్‌ చేస్తుంది. ఈ ఫ్రూట్స్‌ తినడంతో పాటు మధుమేహ గ్రస్తులు కొంచెం వ్యాయామం చేయాల్సి ఉంటుంది.

జామ : జామకాయలో అధికశాతంలో విటమిన్‌ ఎ విటమిన్‌ సి, ఫైబర్‌ ఉండటం వల్ల జామకాయ మధుమేహాన్ని నియంత్రి స్తుంది. మరియు మలబద్దకానికి మంచిది.

చెర్రీ : చెర్రీస్‌లో సుగర్ 20% ఉంటుంది. మధుమేహగ్రస్తులకు చెర్రీస్‌ ను ఓ మంచి స్నాక్‌ అని చెపవచ్చు. వీటిని రోజులో ఎప్పుడైపనా తినవచ్చు.

పీచ్ ఫ్రూట్ : ఈ ఫ్రూట్‌ చాలా మంచి టేస్ట్‌ కలిగి ఉంటుంది. అలాగే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. ఇందులో తక్కువగా ఉండటం వల్ల మధుమేహగ్రస్తులకు చాలా మంచిది.

బెర్రీస్ : బెర్రీస్‌లో చాలా రకాలు ఉన్నాయి, స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ, బ్లాక్‌ బెర్రీ, రాస్పెబెర్రీ, క్రాన్‌ బెర్రీ, చోక్‌ బెర్రీ.. వీటిలో యాంటిఆక్సిడెంట్స్‌ అధికంగా ఉండటం వల్ల మధుమేహగ్రస్తులు నిరభ్యంతరంగా తినవచ్చు.

పైనాపిల్‌ : డైయాబెటిక్‌ పేషంట్స్‌కు చాలా మంచిది. పైనాపిల్‌ వల్ల చాలా ప్రయోజ నాలున్నాయి. యాంటీ వైరల్‌, యాంటీ ఇన్ఫమేటరీగాను క్రిమినాశనకారిగాను పనిచేసే లక్షణాలు సమౄఎద్ధిగా ఉండటం వల్ల మధుమేహగ్రస్తులకు చాలా మంచిది.

మంచి నిద్రతో మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి

 

చాలా మందికి మాటి మాటికి కోపం వస్తుంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అనేది చాలా అవసరం. కోపం రాకుండా మంచి మార్గం ఉందని అంటున్నారు వైద్యులు. కోపం రాకుండా శరీరాన్ని సిద్దం చేయవచ్చని సూచిస్తున్నారు.

దీనికి ధ్యానం అనేది చాలా ఉపయోగపడుతుందని అంటున్నారు. ఉదయాన్నే అరగంట నడకతో మొదలు పెట్టి, నలభై నిమిషాల పాటు యోగా చేసి.. మరో పదిహేను నిమిషాలు ధ్యానం చేయాలని, ఉదయం ఎంత ఆహ్లాదంగా ఉంటే ఆ రోజు అంతే ప్రశాంతంగా గడుస్తుందని అంటున్నారు.

అదే విధంగా మనం తీసుకునే ఆహారంలో ఉద్రేకాలను ప్రేరేపించే మసాలాలు, ఉప్పు, కారం తగ్గించుకోవడం అనేది చాలా అవసరం. సాత్విక ఆహారం తీసుకుంటే సమస్యలు ఉండవని అంటున్నారు.

వేసవిలో వీలైనంత వరకు రోజూ కీరా ముక్కలు, పుచ్చకాయ, టొమాటో రసం, ఫ్రూట్‌ సలాడ్స్‌, పల్చటి మజ్జిగ తీసుకోవడం, మంసాహారం తగ్గించడం వంటివి చెయ్యాలి. ధూమపానం, మద్యం కూడా ఉద్రేకాలకు కారణం అవుతాయి కాబట్టి వాటికి దూరంగా ఉంటే మంచిది. అదే విధంగా మంచి నిద్ర ఉండటం ద్వారా కోపాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ముందు దానితో చికాకులు రావన్నమాట.

ఏపీలో పంచాయితీ ఎన్నికలకు పచ్చ జెండా

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్దమవుతోంది. డిసెంబరు 15కు బ్యాలెట్‌ పేపర్లు సిద్ధం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. ఇక, జనవరి 9న అమ్మ ఒడి ప్రారంభించనున్నారు. ఆ మరుసటి రోజు అంటే జనవరి 10న రిజర్వేషన్ల జాబితా ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఆ మరుసటి రోజు నుంచి ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే సమయంలో బ్యాలెట్‌ పేపర్‌ రంగుల పైనా చర్చ జరిగింది. వార్డు మెంబర్‌ ఎన్నికకు.. తెలుపు అదే విధంగా సర్పంచ్‌ ఎన్నిక కు గులాబి రంగు బ్యాలెట్ వినియోగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

శ‌బ‌రిమ‌ల‌కు వెళ్లిన మ‌హిళ‌పై కారంపొడితో దాడి

ఈ ఏడాది జనవరిలో ధర్మాసనం ఆదేశాలతో 2019 జనవరి 2న బిందు అనే కేరళ మహిళ అయ్యప్పను దర్శించుకుంది. మళ్ళీ ఈ ఏడాది దర్శనం కోసం ఆమె ప్రయత్నించగా అయ్యప్ప భక్తులు కారంపొడి చల్లి దాడి చేశారు. ఎర్నాకుళం సిటీ పోలీస్ కమీషనర్ ఆఫీసు ఎదుట ఈ దాడి జరిగింది. సామాజిక కార్యకర్త తృప్తీ దేశాయ్‌తో కలిసి శబరిమల వెళ్లేందుకు బిందు సిద్ధమైంది. ఇద్దరూ కలిసి తమకు పోలీసుల రక్షణ కావాలని కోరారు. వారిని చూసిన అయ్యప్ప భక్తులు పెప్పర్ స్ప్రే, కారంపొడి చల్లి దాడి చేశారు.

 

తమ హక్కుల ప్రకారం కోర్టు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ అమలు చేయడం లేదని బిందు మండిపడ్డారు. ఎలాగైనా తాము అయ్యప్పను దర్శించుకొని తీరుతామని స్పష్టం చేశారు. కాగా ఇప్పటికే కేరళ ప్రభుత్వం సంచలనాల కోసం అయ్యప్ప దర్శనానికి వచ్చే వారికి రక్షణ కల్పించేది లేదని తేల్చి చెప్పింది.